విజయవాడలో ఘోర ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్‌ రోడ్డుపై సోమవారం ఘోర ప్రమాదం (Vijayawada Accident) జరిగింది. వేగంగా వస్తున్న ఈవీ (EV) కారు డివైడర్‌ను ఢీకొని పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కారులోని నలుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నంబూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు నున్న, నంబూరు వాసులుగా గుర్తించారు.

మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ ఉన్నారు. చనిపోయిన వారిలో మరో చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీస్ అధికారులు సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>