నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

కలం, జోగులాంబ గద్వాల: ​కర్నూల్ జిల్లా నల్లమల ఘాట్ రోడ్డు (Nallamala Ghat Road) లో సోమవారం రాత్రి ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు గద్వాల జిల్లా వాసులుగా గుర్తించారు.

మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా‌ ఉన్నాయి. గద్వాల జిల్లా అయిజ, మల్దకల్ మండలాలకు చెందిన రైతులు సాగు చేసిన కూరగాయలను గుంటూరు జిల్లాలో విక్రయించడానికి ఆటోలో తరలించారు. అయిజ మండలం ఎక్లాస్ పురం గ్రామానికి చెందిన దేవేందర్, తాటికుంట గ్రామానికి చెందిన నితిన్ తో పాటు మరికొందరు బొలేరో వాహనంలో తరలించిన కూరగాయలను గుంటూరులో విక్రయించారు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి‌ కర్నూలు నుండి కాకినాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ హైటెక్ బస్సు, గుంటూరు నుండి గద్వాల జిల్లా అయిజ మండలానికి వస్తున్న బొలెరో వాహనాన్ని నల్లమల ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతి చెందిన వారు గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన దేవేందర్(23), మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన నితిన్‌(22)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
​
సమాచారం అందుకున్న వెంటనే కర్నూల్ జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూల్ జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>