భీమ్‌గల్‌లో విషాదం.. పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్ యజమాని మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ (Bheemgal Suicide) మండల కేంద్రంలో సోమవారం ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన టీ స్టాల్ యజమాని పొలాస సుధాకర్ మృతి చెందారు. సుధాకర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల తోనే ఆత్మహత్యా యత్నం చేశాడని కుటుంబ సభ్యులు, బంధువులు పీఎస్ ముందు ఆందోళన చేశారు.

ఈ ఘటనకు పోలీసుల వేధింపులు లేవని సీపీ సాయి చైతన్య ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే సుధాకర్‌కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>