గానంతో అదరగొట్టిన ఖాకీ.. కానిస్టేబుల్ భైరవద్వీపం ‘శ్రీతుంబర’ గానం వైరల్

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విజయనగరం (Vizianagaram) జిల్లాలోని రాజాం పట్టణంలో పైడితల్లి అమ్మవారి శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఓ కానిస్టేబుల్ అందర్నీ ఆకట్టుకున్నాడు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటరమణ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. భైరవద్వీపం సినిమాలోని కష్టమైన ‘శ్రీతుంబర నారద నాథామృతం‘ అనే శాస్త్రీయ గీతాన్ని ఆలపించారు. వృత్తిరీత్యా పోలీస్ శాఖలో ఉంటూనే, పాటలపై ఆయనకున్న ఆసక్తిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈయన పాట సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ గానానికి అందరూ మైమరిచిపోతూ శభాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>