ఎమ్మెల్యే ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న విజ‌య్‌

క‌లం, వెబ్ డెస్క్: టీవీకే అధినేత విజ‌య్ (TVK Vijay) త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు. టీవీకే 108 స్థానాల్లో విజ‌యం సాధించి త‌మిళ‌నాడులో లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించింది. తిరుచ్చి ఈస్ట్ , పెరంబూర్ నుంచి పోటీ చేసిన విజ‌య్ రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ మేర‌కు విజ‌య్ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిని ఎమ్మెల్యే ధ్రువీక‌ర‌ణ‌ ప‌త్రాన్ని అందుకున్నారు. ముందుగా ఎన్నిక‌ల్లో గెలుపొందిన వెంట‌నే విజ‌య్ త‌న త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్క‌డ వారిని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ త‌ర్వాత లయోలా కాలేజీకి వెళ్లి పెరంబూర్ నుంచి గెలుపొందిన సంద‌ర్భంగా ఎమ్మెల్యే ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు. విజ‌య్ ఇంటితో పాటు ల‌యోలా కాలేజీ వ‌ద్దకు టీవీకే కార్య‌క‌ర్త‌లు, విజ‌య్ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేయ‌లేక ఇబ్బందులు ప‌డ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>