Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ హీరో ఎక్కడ.. ప్రమోషన్స్ లేవు.. పార్టీలు లేవు!

కలం, వెబ్​ డెస్క్​: యంగ్ హీరో నితిన్ (Nithiin) గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌ (Tollywood)లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకప్పుడు ప్రమోషన్లు లేదా సినిమా వేడుకల్లో చురుగ్గా కనిపించే ఆయన ఈ మధ్య ఎక్కడా కనిపించకపోవడం టాలీవుడ్ ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా అల్లు శిరీష్-నయనికల వివాహ వేడుకకు నితిన్ అటెండ్ కాలేదు. వాస్తవానికి నితిన్ భార్య షాలిని, వధువు నయనికకు స్నేహితురాలు కూడా. ఈ పరిచయం ద్వారానే శిరీష్, నయనికలు ఒకటయ్యారని టాక్ ఉన్నప్పటికీ, వేడుకలో నితిన్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రీసెంట్‌గా జరిగిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కూడా నితిన్ కనిపించలేదు.

2025లో వచ్చిన రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలు వరుసగా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో నితిన్ (Nithiin) ఒకింత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఎదురుదెబ్బల తర్వాత ఆయన తన తదుపరి అడుగుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అందుకే మీడియాకు దూరంగా ఉంటూ ఏకాంతాన్ని గడుపుతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. బలగం వేణు ఎల్లమ్మ మూవీని నుంచి నితిన్ తప్పుకోవడంపై కూడా విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో నితిన్ సాలిడ్ హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Read Also: యుద్ధంలో ఎవ‌రు గెలిస్తే వాళ్ల మ‌తంలోకి మార‌తా: ఆర్జీవీ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>