Mobile Popup Ad
Mobile Popup Ad

నాగచైతన్య బాటలో విజయ్ దేవరకొండ.. ఫస్ట్ టైమ్ అలాంటి మూవీ..?

కలం, వెబ్ డెస్క్ : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా తన ప్రతి సినిమాలో స్టోరీ యాంగిల్ మార్చేస్తున్నారు. కింగ్ డమ్ సినిమాకు ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాడో చూశాం. అంతకు ముందు వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీలు యావరేజ్ గా ఆడాయి. అందుకే వాటి తర్వాత కింగ్ డమ్ లాంటి రస్టిక్ మూవీ చేశాడు. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న మూవీలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. రౌడీ జనార్ధన, రణబాలి లాంటి సినిమాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వీటి తర్వాత ఓ మైథలాజికల్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు బాగా పాపులారిటీ దక్కుతోంది.

అందుకే నాగచైతన్య లాంటి హీరో కూడా కార్తీక్ దండు డైరెక్షన్ లో వృషకర్మ లాంటి మూవీ చేస్తున్నాడు. ఈ మధ్య చాలా మంది హీరోలు ఇలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే కాబోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా శౌర్యువ్‌తో ఇలాంటి మూవీ ప్లాన్ చేస్తున్నాడు. హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్షన్ లో విజయ్ ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ మూవీ స్టోరీలో మైథలాజికల్ సబ్జెక్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికే వీరిద్దరి మధ్య దాని గురించి చర్చ జరగ్గా.. లైన్ ఓకే అయినట్టు తెలుస్తోంది. కథ డెవలప్ చేసే పనుల్లో శౌర్యువ్ బిజీగా ఉన్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>