సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసులో కీల‌క ప‌రిణామం!

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు (Saikrishna Lockup Death Case)లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్ సిట్ అధికారుల‌కు లొంగిపోయాడు. సాయికృష్ణ మృతి అనంత‌రం సిట్ విచార‌ణ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి సురేశ్ ప‌రారీలో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో సాయికృష్ణ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సెటిల్‌మెంట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగ‌రాజుకు సురేశ్ అత్యంత స‌న్నిహితుడు అని అధికారులు వెల్ల‌డించారు. కాగా, గురువారం ఉద‌యం సురేశ్ నేరుగా సిట్ కార్యాల‌యానికి వెళ్లి అధికారుల‌కు లొంగిపోయాడు. ఇప్ప‌డు కేసులో సురేశ్ వాంగ్మూలం కీల‌కంగా మార‌నుంది. సాయికృష్ణ మృత‌దేహం మాయం, సెటిల్‌మెంట్ త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న‌ను అధికారులు ప్ర‌శ్నించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>