Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు.. వేణుస్వామి సంచలనం!

కలం, వెబ్‌ డెస్క్‌: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) మరోసారి తన జ్యోతిష్యంతో చర్చకు తెరలేపారు. తమిళ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయ భవిష్యత్తు జాతక రీత్యా ఎన్నో మలుపులతో కూడి ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నటి త్రిష ప్రభావం విజయ్ జాతకంపై గణనీయంగా ఉందని వెల్లడించారు. త్రిష గనుక విజయ్ జీవితంలో లేకుండా ఉంటే ఆయన జాతక చక్రం వేరే రకంగా ఉండేదని విశ్లేషించారు.

విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినా ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని వేణుస్వామి జోస్యం చెప్పారు. విజయ్ సీఎం అయిన ఆరు నెలలు లేదా ఏడాది లోపే తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. అక్కడ మళ్లీ మధ్యంతర ఎన్నికలు రావచ్చని బాంబు పేల్చారు. కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఒకవేళ బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అక్కడ రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు తలెత్తుతాయని తన అంచనాగా పేర్కొన్నారు. వేణుస్వామి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>