భవిష్యత్తులో భారీ మార్పులు.. వేణుస్వామి సంచలన కామెంట్స్

కలం, వెబ్‌డెస్క్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోబోయే పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 31, 2026 నుంచి ప్రపంచంలో పలు అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని కీలక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో పలు బ్యాంకుల కార్యకలాపాల్లో అంతరాయాలు, అమెక్స్‌కు సంబంధించిన సమస్యలు, యాపిల్ క్లౌడ్ సేవల్లో ఇబ్బందులు, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని విమానాశ్రయాల్లో సేవలకు అంతరాయం, లండన్‌లోని కొన్ని ఫ్యాక్టరీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలను ఆయన ప్రస్తావించారు. దీపావళికి ముందు నుంచే బంగారం, వెండి ధరలు తగ్గడంతో పాటు క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురైందని వివరించారు.

ఒక రంగంలో నష్టాలు ఎదురైనప్పుడు పెట్టుబడిదారులు మరో రంగం వైపు మళ్లడం సాధారణమని, అయితే ప్రస్తుతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలన్నా ఇన్వెస్టర్లు ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయని వేణుస్వామి (Venu Swamy) వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని, పొదుపు చేసిన నికర ధనాన్ని భద్రపరచుకోవాలని సూచించారు. కనీసం ఏడాదికి సరిపడా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి జీవిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

Also Read : పశ్చిమ బెంగాల్‌కు కొత్త పేరు.. కేబినెట్ ఆమోదం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>