కేసీఆర్‌ హ‌యాంలోనే ప‌ల్నాడు ప్రాజెక్టుకు బీజం: సీఎం రేవంత్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: నాగార్జున సాగర్‌ నుంచి ఏపీకి నీటిని తరలించే కుట్రలకు గత బీఆర్‌ఎస్‌ హయాంలోనే బీజం పడిందని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప‌ల్నాడు ప్రాజెక్ట్‌ (Palnadu Project) విష‌యంలో బీఆర్ఎస్ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతూ సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు నేడు స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాటి సీఎం జగన్‌ హయాంలో 2022 ఫిబ్రవరి 16న పల్నాడు డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై పేరుతో రూ.1,200 కోట్ల ప్రాజెక్టుకు జీవో విడుదలైంద‌న్నారు. అప్పుడు తెలంగాణ సీఎంగా, ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న కేసీఆర్‌ 20 నెలల పాటు ఎందుకు మౌనం వహించారని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా కృష్ణా బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని నిల‌దీశారు.

కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమరజీవి జలధారగా రీడిజైన్‌ చేసి పనులు వేగవంతం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులకు న‌ష్టం క‌లిగేలా నాడు ఏపీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్ రావు, కేటీఆర్ బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫుల్ స్టోరీ చదవండి

Palnadu Project
Palnadu Project

Also Read : హే పప్పూ.. ఢిల్లీలో ఉన్నది నిప్పు.. బండి సంజయ్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>