ఏపీలో హనీ ట్రాప్.. వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ (Honey Trap) ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. అమాయకులను, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వల విసిరిన ఈ ముఠా సుమారు 20 మందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాకు సంబంధించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల నగదు, రెండు కత్తులు, ఆరు సెల్ ఫోన్లు, కీలకమైన ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొందరు అధికార పార్టీకి చెందినవారు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలతోనే దౌర్జన్యాలకు పాల్పడుతూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు గుంజినట్లు తెలుస్తోంది. ఇలాంటి హనీ ట్రాప్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అనంతపురం పోలీసులు వెల్లడించారు.

అసలు సూత్రధారి ఆమెనే

ఈ ముఠాకు రంగమ్మ నాయుడు అలియాస్ ‘చిన్ని నాయుడమ్మ’ అనే మహిళ ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఈమెతోపాటు మరో ముగ్గురు మహిళలు (జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారి) అరెస్ట్ చేశారు. రంగమ్మ నాయుడు మహిళలను, అమ్మాయిలను ఎరగా వేస్తూ ధనవంతులను టార్గెట్ చేస్తుంది. వారి వ్యక్తిగత వీడియోలు తీసి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా.. పోలీసులు ఎట్టకేలకు హనీ ట్రాప్ (Honey Trap) ముఠాను గుర్తించారు.

Read Also: కోర్టులో పవర్​ కట్​.. గంటన్నరపాటు లిఫ్టులోనే న్యాయవాదులు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>