‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. వెంకీ ఫుల్ జోష్!

కలం, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ (Adarsha Kutumbam AK47) నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘నారాయణమ్మ..’ అంటూ సాగే ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి రాశారు. పాట విడుదల సందర్భంగా స్టేజిపై వెంకటేశ్ డ్యాన్స్ చేస్తూ జోష్ నింపారు. డింపుల్ హయాతి, నివేథా పేతురాజ్, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరువాత 20 ఏళ్లకు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇన్నేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందున అంచనాలు ఎలా ఉంటాయో తెలుసని.. అద్భుతమైన కథ కుదిరిందని తెలిపారు. ప్రేక్షకులను ఎంతో బాగా అలరిస్తుందని చెప్పారు. కథలో చాలా ట్విస్టులు ఉంటాయన్నారు.

మొదటి డైలాగ్ ఆయనకే రాశాను..

డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తాను 1996లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదటి డైలాగ్ వెంకటేశ్ నటించిన పవిత్ర బంధం మూవీకే రాశానని గుర్తు చేసుకున్నారు. అలా ఆయన తన ఫేవరేట్ హీరో అయిపోయారని.. అప్పటికీ, ఇప్పటికీ వెంకటేశ్ వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్నా.. ఇప్పటికీ వెంకటేశ్ అంటే తనకు తెలియని భయమన్నారు. బహుశా అది గౌరవంతో కూడిన భయం కావొచ్చన్నారు. 76 సినిమాలు చేసిన తరువాత కూడా ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అన్నారు. శనివారం రోజు ఆరోగ్యం బాగాలేకపోయినా.. డబ్బింగ్ చెప్పారని, చిత్రంపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>