హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. షెడ్యూల్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ టూర్ ఫిక్సయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు గిగ్ వర్కర్లతో సమావేశమవుతారు. అంతకుముందు భారీ ర్యాలీ కూడా చేపట్టనున్నారు. మధ్యాహ్నం భారత్ సమ్మిట్ ప్రోగ్రాంలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. సాయంత్రం పార్టీ నాయకులతో సమావేశమై.. 8 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

సమ్మిట్ ఏర్పాట్లు పూర్తి..

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ(Future City)లో తెలంగాణ ప్రభుత్వం భారత్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంను రేపటి నుంచి నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను రప్పించి, వారితో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఢిల్లీలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహించిన విషయం తెలిసిందే. కేవలం పెట్టుబడిదారులను కాకుండా.. వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో కలిసి సదస్సుకి రావాలని ఆహ్వానించారు.

Also Read : క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ నటి మోనాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>