కలం, స్పోర్ట్స్ : అబుదాబి T10 (Abu Dhabi T10) క్రికెట్ లీగ్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ లీగ్‌లో పోటీపడేందుకు ‘ఎమిరేట్స్ ఈగిల్స్’ (Emirates Eagles) అనే కొత్త ఫ్రాంచైజీ అధికారికంగా అరంగేట్రం చేసింది. నవంబర్ 7 నుంచి 20 వరకు జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ టోర్నీ కోసం మేవెరిక్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ జట్టును కొనుగోలు చేసింది.తొలి సీజన్‌లోనే ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ఈగిల్స్ మేనేజ్‌మెంట్ బలమైన జట్టును సిద్ధం చేసింది.
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రోవ్‌మన్ పవెల్‌ను కెప్టెన్‌గా నియమించగా.. అంతర్జాతీయ అనుభవం ఉన్న మిక్కీ ఆర్థర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. వీరితో పాటు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, విండీస్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్‌లను నేరుగా జట్టులోకి తీసుకుంది. దీంతో ఎమిరేట్స్ ఈగిల్స్ తొలి సీజన్‌లోనే బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. ఎమిరేట్స్ ఈగిల్స్ రాకపై అబుదాబి క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్ బౌచర్ ఆనందం వ్యక్తం చేశారు. బలమైన ఆటగాళ్లు, అత్యుత్తమ కోచింగ్ బృందంతో వస్తున్న ఈగిల్స్ టోర్నీ స్థాయిని మరింత పెంచుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే క్రీడా బ్రాండ్‌గా ఎమిరేట్స్ ఈగిల్స్‌ను తీర్చిదిద్దడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని మేవెరిక్ స్పోర్ట్స్ ప్రతినిధులు తెలిపారు.
Also Read : ఓట్ల చోరీ కాదు.. ఓటర్ల మనసులు గెలుస్తాం: కిషన్ రెడ్డి
Follow Us On : WhatsApp

