కలం, వెబ్ డెస్క్: ఎన్విడియా కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బోర్డు సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు కూడా తెలిపారు. తాత్కాలిక సీఈవోగా క్రెటెన్ క్రెస్ వ్యవహరించనున్నారు. చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో తన వివాహేతర సంబంధం నిజమేనని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై కంపెనీతో పాటు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఆమె చైనా గూఢచారి అనే విషయం తనకు తెలియదని ఇప్పటికే జెన్సన్ ప్రకటించినా.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. కంపెనీ షేర్లు ఒక వైపు కుప్పకూలుతుండగా.. సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో జెన్సన్ రాజీనామా మరింత ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే..
ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ కంపెనీలకు ఎన్విడియా (Nvidia) కంపెనీనే చిప్‌లు సరఫరా చేస్తూ అగ్రగామిగా పేరు తెచ్చుకుంది. చైనా తన టెక్నాలజీని కాపీ కొట్టి ఏఐ రంగంలో తనకు పోటీ వస్తుందని భావించిన అమెరికా.. ఎన్విడియా కంపెనీ, చిప్‌ల సరఫరాపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే జెన్సన్ హువాంగ్(Jensen Huang)కు దగ్గరైన ఆలిస్ హువాంగ్ అనే చైనా గూఢచారి.. అనేక టెక్నాలజీ రహస్యాలను సింగపూర్ మీదుగా చైనాకు చేరవేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇది అగ్రరాజ్యంలో ప్రకంపనలు రేపుతోంది. జెన్సన్ సైతం తమ మధ్య వివాహేతర సంబంధం ఉందని, తాను భార్యకు ద్రోహం చేశానని అంగీకరించారు. అయితే ఆమె గూఢచారి అనే విషయం తనకు తెలియదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సొంత కంపెనీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Also Read : సోనియా పుస్తకం కాల్చేశారు.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

