బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: వేముల ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : బాన్సువాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త మొరెలి శ్రీనివాస్ రావు ఆయన వెంట పలు గ్రామాల నుంచి వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, బీఆర్‌ఎస్ కుటుంబం మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను అభిమానించే కార్యకర్తలు ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందరినీ ఏకం చేస్తూ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అలాగే జుబేర్, అంజిరెడ్డి, రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్ తదితర నాయకులు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని అభినందించారు.

బాన్సువాడలో జరిగిన ప్రతి అభివృద్ధి పనికి కేసీఆర్ కారణమని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందాయని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటు అధికార పార్టీ చేయించిన సర్వేలలో కూడా బాన్సువాడలో బీఆర్‌ఎస్ విజయమే ఖాయమని తేలిందని వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ ప్రజలు బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, విఠల్ రావు, ఆగయ్య, యలమంచిలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>