ఉత్సాహంగా ‘ఆల్ఫోర్స్’ ఫ్రెషర్స్ పార్టీ

కలం, నిర్మల్ : నూతన విద్యార్థుల జీవితంలో కళాశాల ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మలుస్తూ ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆల్ఫోర్స్ అడ్వెంచర్” ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగింది. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, వినోదాత్మక ఆటలు, వివిధ పోటీలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది.

ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, కష్టపడి చదివే తత్వం, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నాణ్యమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>