కరీంనగర్ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు తెస్తా.. వెలిచాల కీలక హామీలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గంలోని గ్రామాలను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి, భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) అన్నారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల మధ్యే ఉంటూ ప్రతి అవసరాన్ని తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం వెలిచాల రాజేందర్‌రావు గ్రామ సర్పంచ్ సుద్దాల కమలాకర్ గౌడ్ ఉప సర్పంచ్ కచ్చు రజితతో కలిసి భూమిపూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ రావు (Velichala Rajender Rao) మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిపై తనకు పూర్తి స్పష్టత, చిత్తశుద్ధి ఉందన్నారు. గ్రామాలను కేవలం అభివృద్ధి చేయడం కాకుండా చిరస్థాయిలో గుర్తుండిపోయేలా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. తన తండ్రి జగపతిరావు కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు అవసరమైన ప్రతి పనిని పూర్తి చేయడానికి కంకణబద్ధుడినై పనిచేస్తానని అన్నారు.

“గ్రామాల అభివృద్ధికి 100 శాతం కృతనిశ్చయంతో పనిచేస్తా. సర్పంచులు ఏ అవసరం ఉన్నా ఎల్లవేళలా నన్ను సంప్రదించవచ్చు. పలకరిస్తే పలుకుతా.. పిలిస్తే గ్రామంలో వాలుతా.. చెప్పిన పనిని సాధ్యమైనంత త్వరగా చేసి పెడతా. సర్పంచులకు తగిన గౌరవం ఇస్తా” అని వెలిచాల రాజేందర్‌రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి గ్రామాల అవసరాలను తీసుకెళ్లి, పెద్దఎత్తున నిధులు సాధించి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. జూబ్లీ నగర్ అభివృద్ధికి తనవంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

జూబ్లీ నగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్‌గౌడ్ యువ, ఉత్సాహవంతమైన నాయకుడిగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాల కమలాకర్ గౌడ్, ఉప సర్పంచ్ కచ్చు రజిత, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సన్న, బోగొండ ఐలయ్య, బొద్దుల లక్ష్మీనారాయణ, తిరుపతిరెడ్డి, జగ్గాని కనుకయ్య, జక్కం నర్సయ్య, గంగయ్య, మీసాల శంకర్, దావు మల్లయ్య, కాశిపాక రాకేష్, అనంతుల రమేష్, మూల కృష్ణారెడ్డి, ఆట్టేపు వేణు, పోరండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : జైపూర్‌లో హై టెన్షన్.. సీజేపీ కోకన్వీనర్ అశుతోష్ రాంగాపై దాడి..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>