అటవీ శాఖ తీరుపై వటువర్లపల్లి గ్రామస్తుల ఆగ్రహం

కలం, అచ్చంపేట : నల్లమల అడవిలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని వటువర్లపల్లి గ్రామస్తులు (Vatwarlapalle Villagers) అటవీ శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గ్రామ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపిస్తూ మంగళవారం ఉదయం శ్రీశైలం- హైదరాబాద్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ చత్రు నాయక్ మాట్లాడుతూ.. పునరావసం పేరుతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని అమలు పరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ (Forest Department) నిబంధనలతో స్థానికంగా జీవనం కొనసాగిస్తున్న గ్రామస్తులను సైతం చెక్ పోస్ట్ వద్ద వదలకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తు చేశారు. స్థానిక ప్రజల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు టోల్ వసూలు చేసే విధానాన్ని మానుకొని వెసులుబాటు కల్పించాలని కోరారు. పునరావాసం కోరుకునే గ్రామస్తులకు తాము వ్యతిరేకం కాదని కానీ ఆ పేరుతో స్థానిక ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్నాడు బాధాకరమని గుర్తు చేశారు.

వటువర్లపల్లి గ్రామం అభివృద్ధి జరగకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి. తెచ్చుకుంటున్న ఇసుక కంకర రాకుండా అడ్డుకుంటున్నారని గ్రామంలో ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ మంజూరై నిర్మాణ మధ్యలో నిలిపివేశారు అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఆశ్రమ పాఠశాలకు కాంపౌండ్ వాల్ మంజూరైతే కూడా అటవీశాఖ అధికారులు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్న పనులను నిర్మించకుండా కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రీలొకేషన్ పేరుతో గ్రామంలో కొంతమందిని భయభ్రాంతులకు గురిచేసి వారిని ప్రలోభాలకు గురిచేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని రీ లొకేషన్ వద్దు మా గ్రామమే ముద్దు మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే జీవిస్తామని గ్రామస్తులు చెబుతున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చత్రు నాయక్, సర్య నాయక్, వార్డు సభ్యులు చిట్టెమ్మ ,మౌనిక, వెంకటపతి, సాయిబాబు ,మాజీ వార్డు సభ్యులు, సాలమ్మ ,భరత్, రమేష్ గ్రామ పెద్దలు ఇమ్మడి కిష్టయ్య, కాశయ్య, భవాని , సట్టి అంజయ్య, కృష్ణా నాయక్, రత్యానాయక్, మహిళా సంఘాల ప్రతినిధులు జ్యోతి, అనసూయ, చీని, మణెమ్మ, పద్మమ్మ, ఈదమ్మ చిట్టెమ్మ గ్రామ యువకులు ప్రభాకర్, ఇమ్మడి అనిల్, మంతటి అంజి, అఖిల్ ,శివకుమార్, సాయి , మహిళలు గ్రామ యువకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>