డెలివ‌రీ టైంలో మ‌హిళ మృతి.. డాక్ట‌ర్ సూసైడ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాజ‌స్థాన్‌లో దారుణ‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డెలివ‌రీ కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చిన మ‌హిళ ఆప‌రేష‌న్ జ‌రుగుతుండ‌గానే మృతి చెందింది. మ‌హిళ మృతితో కుటుంబ‌స‌భ్యులు ఆమెకు చికిత్స అందించిన‌ డాక్ట‌ర్‌పై కేసు (Rajasthan Doctor Case) పెట్టారు. అవ‌మాన భారంతో స‌ద‌రు డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న దౌసా జిల్లాలోని లాల్‌సోట్‌లో జ‌రిగింది. ఇటీవ‌ల‌ ఆశా అనే మ‌హిళ ఓ ఆస్ప‌త్రికి డెలివ‌రీ కోసం వ‌చ్చింది. డాక్ట‌ర్ అర్చ‌నా శ‌ర్మ ఆమెకు ట్రీట్‌మెంట్ చేశారు. ప్ర‌స‌వ స‌మ‌యంలో ఆశా తీవ్ర ర‌క్త‌స్రావ‌మై మృతి చెందింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజే సుమారు 200 మంది స‌ద‌రు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వ‌చ్చి ఆందోళ‌న నిర్వ‌హించారు. వీరికి స్థానిక రాజ‌కీయ నాయ‌కులు కూడా అండ‌గా నిలిచారు.

ఆస్ప‌త్రి వ‌ద్ద ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు అక్క‌డికి చేరుకొని డాక్ట‌ర్ అర్చ‌నా శ‌ర్మ‌, ఆమె భ‌ర్త డాక్ట‌ర్ సునీత్ ఉపాధ్యాయ్‌ల‌పై హ‌త్య కేసు న‌మోదు చేశారు. డాక్ట‌ర్ల నుంచి ఎలాంటి వివ‌ర‌ణ తీసుకోకుండా స్వ‌తంత్రంగా హ‌త్య కేసు పెట్ట‌డం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌ర్భిణి మృతి, హ‌త్య కేసుతో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన అర్చ‌నా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి ముందు ఆమె ఓ లేఖ రాశారు. తాను ఎవ‌రినీ చంప‌లేద‌ని, ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పేర్కొన్నారు.

అర్చనా ఆత్మ‌హ‌త్య‌తో రాష్ట్ర వ్యాప్తంగా డాక్ట‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైద్య సేవ‌ల‌ను నిలిపి వేసి నిర‌స‌న‌ల‌కు దిగారు. దీంతో దిగొచ్చిన అధికారులు, పోలీసులు డాక్ట‌ర్ దంప‌తుల‌పై న‌మోదైన హ‌త్య కేసును కొట్టేశారు. ఈ కేసు పై ఆశా భ‌ర్త లాలూరామ్‌ స్పందించారు. త‌న‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం రాద‌ని, త‌న‌తో బ‌ల‌వంతంగా సంత‌కం చేయించార‌ని వెల్లడించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేప‌డంతో పోలీస్ ఉన్న‌తాధికారులు స్థానిక అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్ప‌టికే జిల్లా ఎస్పీని బ‌దిలీ చేశారు. స్టేష‌న్ హెడ్‌ ఆఫీస‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. స్థానిక రాజ‌కీయ నేత‌ల‌ను ప‌లువురిని అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>