యూపీఐ చెల్లింపులపై కీలక ప్రకటన.. ఆ ఛార్జీల అమలు వాయిదా!

కలం, వెబ్ డెస్క్ : డిజిటల్ లావాదేవీలు జరిపే వినియోగదారులకు, వ్యాపారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీపి కబురు అందించింది. యూపీఐ ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలపై విధించాలనుకున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల (UPI MDR Charges) అమలును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పండుగ సీజన్ దృష్ట్యా ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఉపశమనం కలిగిస్తూ ఈ ఛార్జీలను దీపావళి తర్వాతే అమలు చేయాలని NPCI నిర్ణయించింది.

గతంలో ప్రకటించిన నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని ఎంపిక చేసిన వ్యాపార (P2M) లావాదేవీలపై 0.4% మేర ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయని ఎన్‌పీసీఐ భావించింది. రూ. 2,000 వరకు లావాదేవీలకు పూర్తిగా ఉచితంగా చేసుకోవచ్చు. అయితే అంతకుమించి అంటే రూ. 3000కు రూ. 12, అలాగే రూ. 5,000కు రూ. 20 ఛార్జీలు పడుతాయి. ఇలా లావాదేవీకి రూ. 300 ఎండీఆర్ ఛార్జీలు మాత్రమే గరిష్ట పరిమితి ఉంటుంది.

ముఖ్యంగా దసరా, దీపావళి పండుగ వేళ కేంద్రం దీన్ని అమలు చేయనుండడం పట్ల చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీల అమలును NPCI వాయిదా వేసింది. పండుగ వేళ మార్కెట్‌లో డిజిటల్ లావాదేవీల వినియోగానికి ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ముందస్తుగా నిలిపివేసింది. దీపావళి పూర్తయిన తర్వాతే ఛార్జీల అమలుకు సంబంధించిన తదుపరి తేదీలు, సమగ్ర మార్గదర్శకాలను వెల్లడించనున్నట్లు NPCI తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>