తెగిన ‘పెద్దవాగు’ ప్రాజెక్టు రింగ్ కట్ట.. దిగువ ప్రాంతాలకు హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్ : ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు (Peddavagu Project) రింగ్ కట్ట తెగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు కట్టపై ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు నుంచి నీరు ఒక్కసారిగా దిగువకు ఉప్పెనలా పోటెత్తడంతో సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాలకు అధికారులు అత్యవసర వరద హెచ్చరికలు జారీ చేశారు.

వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో వేలేరుపాడు మండలంలోని పలు దిగువ గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉమ్మడి నీటిపారుదల ప్రయోజనాలు ఉన్న ఈ పెద్దవాగు ప్రాజెక్టు గత మూడేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు తెగిపోవడం ఆందోళనను కలిగిస్తోంది. పదేపదే కట్ట తెగిపోతుండటం, నిర్వహణ లోపాలు, వర్షకాలంలో తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి తమను వరద ముప్పు నుంచి కాపాడాలని ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>