వలిగొండలో ఘనంగా కృష్ణాష్టమి.. ఉట్టీ కొట్టే కార్యక్రమాల్లో యువకుల ఉత్సాహం

కలం, వలిగొండ: తెలంగాణ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే వలిగొండ ( Valigonda) మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం కృష్ణాష్టమిని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళలో కూడలిల వద్ద ఉట్లు కొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉట్ల కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>