కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) పట్టణ కేంద్రానికి చెందిన చెస్ క్రీడాకారిణి బి.టీనా ఉమ్మడి జిల్లా అండర్-17 చెస్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుపొందింది. మేకల అభినవ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా చెస్ అసోసియేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ (Nalgonda) ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ పోటీలు జరిగాయి. అండర్-17 విభాగంలో బి. టీనా పాల్గొని 5 రౌండ్లలో వరుసగా విజయం సాధించింది. ఫైనల్‌లో ద్వితీయ బహుమతిని గెలిచింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా మెమెంటో, ప్రశంసాపత్రం అందుకుంది.

