Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ అరంగేట్రం వాయిదా.. సచిన్ రికార్డు అలాగే

కలం, స్పోర్ట్స్ : భారత్-ఐర్లాండ్ (India vs Ireland) తొలి టీ20 మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తుది ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా తరఫున అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్ మరోసారి వాయిదా పడింది. వైభవ్‌కు అవకాశం లభిస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచేవాడు. ప్రస్తుతం ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిటే కొనసాగుతోంది. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం లేకుండాపోయింది.

15 ఏళ్ల వయసులోనే వైభవ్ (Vaibhav Sooryavanshi) తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్‌రేట్‌తో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు ఆడుతూ శ్రీలంక-ఏపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నమోదు చేశాడు.

వైభవ్ ప్రతిభపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, లక్నో జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో రెండోసారి మాత్రమే ఒక ఆటగాడితో సెల్ఫీ తీసుకున్నానని, అది వైభవ్‌తోనే అని తెలిపారు. అతని ప్రతిభ, ఆత్మవిశ్వాసం, షాట్లు ఆడే తీరు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆఫ్‌సైడ్‌లో భారీ షాట్లు ఆడే సామర్థ్యం ప్రత్యేకంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో తొలి బంతికే కవర్స్ మీదుగా భారీ సిక్స్ కొట్టిన షాట్ అతని సామర్థ్యానికి నిదర్శనమని గుర్తు చేశారు.

Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>