Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా ఎఫ్-1 వీసాలో ఆ నిబంధన రద్దు..?

విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1 వీసాల(F1 visa) విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వీసాల జారీలో ప్రస్తుతం ఉన్న ‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధనను రద్దు చేయాలని అమెరికా చట్టసభ సభ్యులు ప్రతిపాదించారు. డిగ్నీ యాక్ట్-2025లో ఈ సవరణ చేయాలని వారు కోరుతున్నారు. ఈ నిబంధన ప్రకారం.. అమెరికా చదువు కోసం వచ్చిన విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి తమ దేశానికి వెళ్తామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చట్ట సభ సభ్యులు ప్రతిపాదించిన సవరణ జరిగితే ఇకపై అమెరికాకు చదువు కోసం వచ్చే విద్యార్థులు తాము తమ స్వదేశానికి తిరిగ వెళ్తామని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు తిరిగి వెళ్తారా? లేదా? అని అధికారులు ప్రశ్నించరన్నమాట.

అయితే ఎఫ్-1 వీసా(F1 visa) దరఖాస్తుల్లో చాలా వరకు ఈ నిబంధన కిందే తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నిబంధన ప్రకారం వీసా దరఖాస్తుదారులు.. తాము తప్పకుండా తిరిగి స్వదేశానికి వెళ్తామని కాన్సులర్ అధికారి దగ్గర నిరూపించుకోవాలి. అందుకోసం స్వదేశంలో తమకు ఉన్న ఆస్తులు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధన కింద ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్న క్రమంలో చట్ట సభ సభ్యులు ఈ నిబంధన రద్దును ప్రతిపాదించారు.

Read Also: UN తో చేతులు కలిపిన సమంత.. దేనికోసమంటే..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>