‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ లో లాంఛనం గా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వరంగల్ (Warangal) పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ చీపుర్లు చేతబట్టి కార్యాలయ ఆవరణ లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేశ్, అకౌంట్స్ అధికారి శివ లింగం, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఏం హెచ్ ఓ డా.రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Read Also: నేపాల్​ ఎన్నికలు : దూసుకుపోతున్న మాజీ మేయర్​ పార్టీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>