కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: యూపీఏ హయాంలో సుమారు రూ.12 లక్ష​ల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) విమర్శించారు. ఏ రంగంలో చూసినా కుంభకోణాలే దర్శనమిచ్చాయన్నారు. దేశ అభివృద్దిని అడ్డుకున్నారని.. కానీ గత 12 ఏళ్లలో మోదీ పాలనలో ఒక్క అవినీతి అయినా కనిపించిందా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే నిరూపించాలన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక రైల్వే రంగంలో గణనీయ పురోగతి కనిపిస్తోందన్నారు.

స్వీడన్ తరువాత భారత్..

2015–16లో రైల్వేలో డీజిల్ కొనుగోళ్లకు ఏటా రూ.293 కోట్లు ఖర్చయ్యేవని అమిత్ షా గుర్తు చేశారు. 2024–25 నాటికి మోదీ ప్రభుత్వం రూ.108 కోట్లకు తగ్గించగలిగిందన్నారు. 2030 నాటికి రైల్వేలో నెట్ జోరో అమల్లోకి రాబోతుందన్నారు. ఒక్క ఏడాదిలోనే ఎన్డీయే ప్రభుత్వం 7,188 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుద్దీకరణ చేసిందన్నారు. 99.6 శాతం రైల్వే నెట్‌వర్క్ ఎలక్ట్రిక్ విధానంలో మారిపోయిందన్నారు. ప్రపంచంలో ఒక్క స్వీడన్ దేశం మాత్రమే వంద శాతం విద్యుద్దీకరణ సాధించిందని.. భారత్ కూడా ఆ కోవలో చేరబోతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>