ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశం కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంచుతూ (DA Hike) ఆమోదం తెలిపింది. కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (DR Increase )లను 3 శాతం మేర పెంచనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. డీఏ, పెన్షనర్ల డీఆర్ వారి మూల వేతనం లేదా పేన్షన్ లో 60 శాతం నుంచి 63 శాతానికి పెరగనున్నాయని, ఈ పెంపు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు.

కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం..

డీఏ, డీఆర్‌ల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 10,016 కోట్ల భారం పడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సుమారు 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లు లబ్ధి పొందుతారని వివరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే అలవెన్సులను సర్దుబాటు చేయడం ద్వారా పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా క్యాబినెట్​ (Union Cabinet) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అనుమానాస్ప‌ద మృతి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>