కలం, నాగర్కర్నూల్: NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో NHM జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణలో NHM ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NHM జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, జేఏసీ సభ్యులు హైమావతి, డాక్టర్ జగన్, బీముడు, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

