డ్రగ్స్‌ మాఫియాకు యువతే టార్గెట్‌.. జాగ్రత్త: సద్ది వెంకట్ రెడ్డి

కలం, యాదగిరిగుట్ట: “యువత తమ భవిష్యత్తును మత్తు పదార్థాలకు బలి చేయకుండా, వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని యాదగిరిగుట్ట (Yadagirigutta) లో విద్యార్థులు గళమెత్తారు. డ్రగ్స్‌ రహిత భారతమే లక్ష్యంగా, మత్తు పదార్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ (Drug Awareness Rally) నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా, గవర్నర్ పిలుపునకు అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఈ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. ర్యాలీ అనంతరం స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులకు, ప్రజలకు మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన (Drug Awareness Rally) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సద్ది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన యువతే దేశానికి అసలైన సంపద అని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులు, సమావేశానికి హాజరైన వారితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, డ్రగ్స్‌ రహిత భారత్‌ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యనిర్వాహక సభ్యులు జంపాల అంజయ్య, ఐలేని రాంరెడ్డి, ఇమ్మడి రామచంద్రారెడ్డి, మేకల వెంకటేశ్వర రెడ్డి, మామిండ్ల అమరేందర్ రెడ్డి, బహుపేట సర్పంచ్ కవిడె మహేందర్, మెతుకు భాస్కర్ రెడ్డి, గోపాల యాదగిరి, విజ్ఞాన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీలో స‌ర్ ప్ర‌క్రియ‌పై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>