epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

ఆ పదిరోజులు..మహాయజ్ఞమే!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్ (Budget 2026) తయారీ కోసం మహాయజ్ఞమే జరుగుతుంది! ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదారు నెలల ముందు నుంచే శాఖలవారీగా ప్రతిపాదనలు తీసుకుంటుంది. అధికారులతో, మంత్రులతో చర్చలు జరుపుతుంది. చివరిగా ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టే పదిరోజుల ముందు అసలైన బడ్జెట్ యజ్ఞం మొదలవుతుంది. పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో 100 మందికిపైగా కీలక సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బడ్జెట్ తయారీ, ముద్రణ పనిలో నిమగ్నమవుతారు. అలా నిమగ్నమవడానికి ఓ వేడుక నిర్వహిస్తారు.

దానిపేరే ‘హల్వా సెర్మనీ’ (Halwa Ceremony). ఒక పెద్ద గిన్నెలో హల్వా వండి, సిబ్బందికి ఆర్థిక మంత్రి రుచిచూపిస్తారు. హల్వా వేడుక ముగియగానే.. జనవరి 31 అర్ధరాత్రి దాటే వరకు బడ్జెట్ యజ్ఞంలోనే సిబ్బంది ఉంటారు. ఫోన్లు కూడా వాడరు. కుటుంబ సభ్యులను కలవరు. ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోయినా.. బయటికి అడుగుపెట్టారు. అంతకట్టుదిట్టంగా మన దేశ ఏడాది పద్దుల చిట్టాను రెడీ చేస్తారు.

Read Also: మున్సిపల్​ ఎన్నికల ప్రచారం.. సీఎం రేవంత్​ రెడ్డి షెడ్యూల్​ మార్పు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>