Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మలమ్మకు సాటి లేరెవ్వరు!

కలం, తెలంగాణ బ్యూరో: తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ తో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ టేబుల్ చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం కానుంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. 2024 జులైలో నిర్మలమ్మ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును అధిగమించారు. 2025లో 8వ సారి ఆమె బడ్జెట్ ను టేబుల్ చేశారు. మన పార్లమెంట్ హిస్టరీలో కంటిన్యూగా అత్యధికసార్లు బడ్జెట్ (Union Budget) ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచిపోయారు.

– బడ్జెట్ స్పీచ్ ను ఎక్కువసేపు చదివిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ సొంతం! 2020–21 బడ్జెట్ సందర్భంగా 2 గంటల 42 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. కవితలు, చిన్న చిన్న కథలతో స్పీచ్ ను ఆద్యంతం ఆకట్టుకునేలా కొనసాగించారు. ఆ తర్వాత స్థానం జశ్వంత్ సింగ్ ది. ఆయన 2003లో 2 గంటల 13 నిమిషాలు బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు.

– సూట్ కేసులో బడ్జెట్ పత్రాలను తెచ్చే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టి.. 2019లో బహీ ఖాతా (ఎరుపురంగు సంచి)ను బడ్జెట్ కు ఉపయోగించిన ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2021లో పేపర్ లెస్ బడ్జెట్ ను తీసుకొచ్చి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఆ ఏడాది నుంచి మనకు డిజిటల్ బడ్జెట్ అందుబాటులోకి వచ్చింది.

– వరుసగా కాకుండా ఎక్కువసార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర చూస్తే.. : మొరార్జీ దేశాయి (10 సార్లు) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానం పి. చిదంబరం (9) ఉంది. ఇప్పుడు తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టి చిదంబరం స్థానానికి నిర్మలమ్మ (Nirmala Sitharaman) రీచ్ అవుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Read Also: గ్లోబల్ ఎకనామిక్ పవర్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>