ఏపీ సీఎంను క‌లిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu)ను నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మార్చి 5న భ‌ట్టి కుమారుడి పెళ్లి ఉన్న నేప‌థ్యంలో కొద్ది రోజులుగా ఆయన రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబును క‌లిసి హైదరాబాద్‌లో జరుగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజ‌రు కావాల‌ని కోరారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా క‌లిసి పెళ్లికి ఆహ్వానించారు.

దీనికి ముందు భ‌ట్టి (Bhatti Vikramarka) కుటుంబ స‌మేతంగా విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు భ‌ట్టికి స్వాగ‌తం ప‌లికి స‌న్మానించి, ప్ర‌త్యేక పూజ‌ల అనంతరం అమ్మ‌వారి ప్ర‌సాదం అంద‌జేశారు. ఈ వివాహ వేడుక‌కు సంబంధించి భ‌ట్టి విక్ర‌మార్క ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, క‌ర్ణాట‌క సీఎం సిద్ధ రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ల‌ను కూడా ఆహ్వానించారు.

Read Also : కడిగిన ముత్యంలా బయటకువచ్చా: కల్వకుంట్ల కవిత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>