స్మిత్​కు మెరుగైన వైద్యం అందించాలి.. యూఏఈ ఉప ప్రధాని ఆదేశాలు

క‌లం, వెబ్‌డెస్క్‌: అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫ్లై దుబాయ్‌ పైలట్ స్మిత్ మచ్చర్‌ (Smit Machchhar)ను యూఏఈ ఉప ప్రధాని హమ్దాన్ బిన్ మహమ్మద్ (Hamdan bin Mohammed) శనివారం పరామర్శించారు. స్మిత్​ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అత్యుత్తమ ధైర్యసాహసాలు, బాధ్యతలను ప్రదర్శించిన కెప్టెన్​ స్మిత్ మచ్చర్ దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఆయన లాంటి వారు యూఏఈ బృందంలో భాగం కావడం తమ దేశ విలువలు, శాంతి, కరుణలకు ప్రతీక అని పేర్కొన్నారు. స్మిత్​ మచ్ఛర్​కు అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ప్రయాణిస్తుండగా స్మిత్ మచ్చర్‌పై ఆయన కో పైలట్ కాక్‌పిట్​లోనే కత్తితో దాడి చేశాడు. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో కో పైలట్ జరిపిన ఈ షాకింగ్​ పరిణామంతో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి ఆయన కాక్‌పిట్ డోర్‌ను తెరిచి, ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో పెను ప్రమాదాన్ని తప్పించి వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో గాయపడిన ఆయన అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్మిత్​ తో భారత ప్రధాని మోదీ సైతం వీడియో కాల్​ మాట్లాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>