కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చొప్పదండి (Choppadandi) మండలం చాకుంట ఎక్స్ రోడ్డులో బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం జరిగింది. చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన తాటికొండ సాయికిరణ్(23), చిలుక ప్రదీప్(23) ఇద్దరు చాకుంటలో జరుగుతున్న వివాహానికి బైక్‌పై బయల్దేరారు.
అతివేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి.. ఇద్దరి తలల నుంచి టైర్లు ఎక్కించడంతో మెదడు బయటకు వచ్చి స్పాట్లోనే చనిపోయారు. యాక్సిడెంట్(Road accident) సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. వివాహానికి బయలు దేరిన ఐదు నిమిషాలలోపే ఇద్దరు ఫ్రెండ్స్ లారీ యాక్సిడెంట్లో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Sharechat

