మేడ్చల్ జిల్లాలో విషాదం: చెట్టును ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిమ్మాయిపల్లి వద్ద అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనకరాజు, అరుణ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. బాధితులు టీ తాగేందుకు జవహర్ నగర్ నుంచి యాద్గర్‌పల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బైక్ వేగంగా నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ‘అణచివేత నుంచి అధికారం వైపు’.. !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>