సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే: పువ్వాడ

కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు కేసీఆర్ ప్రభుత్వం ‘సీతారామ ప్రాజెక్టు’(Sita Rama Project) రూపంలో పునర్జీవం పోసి అభివృద్ధి పథంలో నడిపించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత కాంగ్రెస్ (వైఎస్ఆర్) ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు అవినీతి, అక్రమాలతో కునారిల్లాయని ఆరోపించారు. జలయజ్ఞాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ‘ధనయజ్ఞం’గా మార్చిందని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును చేపట్టి పనులను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి, 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్‌లు, పైప్‌లైన్లు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు నిర్మించడంతో పాటు అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను ఏర్పాటు చేశామని వివరించారు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి కీలక సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు పనులను 90 శాతం వరకు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని పువ్వాడ అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టును రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు తమ ప్రభుత్వం చేసిన పనులుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటున్నారని పువ్వాడ విమర్శించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>