కలం, వెబ్ డెస్క్ : బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువతులు అడ్డంగా బుక్కైన ఘటన బిహార్ రాజధాని పాట్నా(Patna Gold Theft)లో చోటు చేసుకుంది. దిగా ప్రాంతంలో గల నగదు దుకాణానికి వచ్చిన మాస్కులు ధరించిన ఇద్దరు యువతులు.. జువెలరీ షాప్ యజమానిని మాటల్లో పెట్టారు. అనంతరం యజమాని గోల్డ్ చూపిస్తుండగా.. వారిలో ఒక యువతి పెప్పర్ స్ప్రేను బయటకు తీసి యజమాని ముఖంపై కొట్టింది. అయితే వెంటనే యజమాని అప్రమత్తమై కేకలు వేస్తూ వారు షాపు లోపల ఉండేలా డోర్ క్లోజ్ చేశాడు. చుట్టుపక్కల వారు చుట్టుముట్టడంతో తప్పించుకునే అవకాశం లేకపోవడంతో యువతులు షాపులోనే ఉండిపోయారు.
అయితే ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరగాగ.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఘటన అనంతరం యజమాని ఫిర్యాదు మేరకు ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో యువతులు పెప్పర్ స్ప్రేను కొట్టి అలాగే నిల్చొని యజమానికి దొరకడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

