కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 90 రోజుల లోపల నిధుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు 5,972కు గాను 3,493 ఇళ్లకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు చెల్లించామన్నారు. మిగతా 2478 ఇళ్లకు నెలాఖరులోగా అంచనాలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో, పీడీ డీఆర్డీవో, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ ఏఈలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ స్టాఫ్, ఈసీలు, ఏపీవోలు పాల్గొన్నారు.

