అక్ర‌మంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్ల‌ పట్టివేత

కలం, జనగామ: ప్రభుత్వ అనుమతులు లేకుండా జనగామ (Jangaon) రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం నుండి అశ్వరావుపల్లి గ్రామానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు ప‌ట్టుకున్నారు. ట్రాక్ట‌ర్ల‌ను సీజ్ చేసి కేసు నమోదు చేనినట్లు రఘునాథపల్లి ఎస్ఐ డి.నరేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం… అశ్వరావుపల్లి సమీపంలో పాట్రోలింగ్ చేస్తుండగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ కుసుంబారాజు, యజమాని పేరబోయిన అశోక్, అలాగే మరో ట్రాక్టర్ డ్రైవర్ వల్లెపు శ్రీకాంత్‌ల‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల‌ నిర్మాణం గానీ లేదా ఇతర స్థానిక అవసరాల కోసం ఇసుక, మట్టి అవసరమైతే తప్పనిసరిగా మండల తహసీల్దార్ ద్వారా జనగాం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాల‌ని, ఆ త‌ర్వాతే ఇసుక రవాణా చేయాల‌ని సూచించారు. అనుమతులు లేకుండా ఇసుక, మట్టి రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>