కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. 8 నెలల పసికందును ఎత్తుకెళ్లి..!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బీర్కూర్ (Birkur) ‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. తండ్రి పక్కన నిద్రిస్తున్న ముక్కు పచ్చలారని ఎనిమిది నెలల పసి పాపను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు పాప ఒళ్లంతా బ్లేడ్‌తో గాయాలు (గాట్లు) చేశారు. ఆపై చెట్ల పొదల్లో పారేశారు.

బీర్కూర్ ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీష్‌కు ఇద్దరు భార్యలు.. మొదటి భార్య శైలజకు ముగ్గురు అమ్మాయిలు. రెండో భార్య సంధ్యకు ఎనిమిది నెలల పాప వైష్ణవి ఉంది. రెండో భార్య సంధ్యతో గొడవ కారణంగా ఆమెను తన తల్లిగారింటికి పంపాడు. పాప వైష్ణవి మాత్రం తనతోనే ఉంది. రాత్రి తండ్రి సతీశ్ తన రెండో భార్య కూతురు అయిన ఎనిమిది నెలల పాప వైష్ణవితో కలిసి ఆరు బయట నిద్రపోయాడు.

రాత్రి 8 గంటలకు పాప కనిపించకపోవడంతో ఇంట్లో ఉన్న మొదటి భార్య వద్ద ఉంటుందనుకొని మళ్ళీ నిద్ర పోయాడు. తిరిగి ఉదయం 5 గంటలకు నిద్ర లేచాక పాప ఎక్కడ ఉందని ఇంట్లో ఉన్న భార్య, తల్లిని అడిగాడు. వారు తమ వద్ద లేదనడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విషయాన్ని సతీష్ పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లాడు.

స్థానికులు, బంధువులు పెద్ద మనుషులు కొందరితో కలిసి చిన్నారి కోసం గాలించారు. గోసంగి సంఘ భవనం సమీపంలోని పొదల్లో చిన్నారి సృహ కోల్పోయి కనిపించింది. ఆ చిన్నారి ఒళ్లంతా బ్లేడ్‌తో చేసిన గాయాలు ఉన్నాయి. వెంటనే చిన్నారిని బాన్సువాడ ఆసుపత్రికి అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు చెప్పారు.. పాప పై గాట్లు ఎవరు వేశారు.. ఎందుకు వేశారనేది తెలియాల్సి ఉంది. అలాగే హత్య కోణం ఏమైనా ఉందా అనేది కూడా బయటపడాలి. పాప గాయాలు చూస్తే ఒళ్ళంత జలదరిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>