అమ్రాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ (Amrabad) మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బ్రహ్మగిరి ఎస్సై జయన్న వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా జింజాక్ గ్రామానికి చెందిన 16 మంది కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. గ్వాలియర్ నుంచి ఈ నెల19న రైలు ద్వారా కాచిగూడకు చేరుకుని అక్కడి నుంచి హైద్రాబాద్‌లో క్రూజర్ అద్దెకు తీసుకుని 19న సాయంత్రం శ్రీశైలం చేరుకున్నారు. అక్కడే రెండు రోజులు బస చేసిన అనంతరం సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు.

అదుపు తప్పి.. బుల్లెట్ బండిని ఢీకొట్టి

ఈ క్రమంలో అమ్రాబాద్ (Amrabad) మండలం బ్రహ్మగిరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో క్రూజర్ అదుపు తప్పి ఏపీలోని అమలాపురానికి చెందిన హర్ష అనే వ్యక్తి బుల్లెట్‌ను తాకి తరువాత చెట్టును ఢీకొట్టింది. దీంతో క్రూజర్ వాహనంలో ఉన్న 16 మందిలో అమన్ గుప్తా (25) అక్కడే మృతి చెందగా, అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుల్లెట్ బండి నడిపించిన హర్ష(25) మరణించారు. 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Also Read : తెలంగాణ స‌ర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>