Mobile Popup Ad
Mobile Popup Ad

కోరుకొండలో ఘోర ప్రమాదం.. మృతదేహంతో వైసీపీ ధర్నా

కలం, వెబ్ డెస్క్ :  తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ (Korukonda) పరిధిలోని జంబుపట్నంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడ్‌తో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నొక్కి రాజు వర్మ (27) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వైసీపీ నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja) ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. రాత్రివేళల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, అలాగే అతివేగంగా లారీలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగడంతో కోరుకొండ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>