epaper
Monday, February 23, 2026
epaper

డెస్క్ జర్నలిస్టులందరికీ ‘అక్రిడిటేషన్’ ఇవ్వాలి : TWJF

కలం/ఖమ్మం బ్యూరో : డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డును ఇవ్వాలని ఖమ్మం టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ముందు జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ… అక్రెడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి, ఎడిషన్ సెంటర్లో అదనంగా ముగ్గురు డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు వచ్చాయని, ప్రస్తుతం ఎడిషన్ సెంటర్ కు నాలుగు కార్డులే ఇస్తామని రూల్ పెట్టారని చెప్పారు. దీని వల్ల అనేకమంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు.

డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పనిచేసినా… ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్క్ లు వేరుగా ఉంటాయని సయ్యద్ ఖదీర్ చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ఇన్చార్జితో పాటు నలుగురు సబ్ ఎడిటర్లు ఉంటారని.. ఎడిషన్ కు నాలుగు కార్డులే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించడం అన్యాయం అన్నారు. వారికి 15 కార్డులు ఇవ్వాలని, వెబ్ లో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున డెస్క్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>