బండ్ల గ‌ణేశ్ చెక్ బౌన్స్ కేసులో ట్విస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేశ్ (Bandla Ganesh) చెక్ బౌన్స్ కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిరాలపాడుకు చెందిన జెట్టి జాన‌కి రామ‌య్య అనే వ్య‌క్తి బండ్ల గ‌ణేశ్ 2018లో రూ.95 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నారు. ఆ త‌ర్వాత జాన‌కి రామ‌య్య మృతి చెంద‌డంతో ఆయ‌న తండ్రి వెంక‌టేశ్వ‌ర రావు ఈ అప్పుకు సంబంధించిన బాధ్య‌త‌లు తీసుకున్నారు. త‌మ‌కు ఇవ్వాల్సిన డ‌బ్బు చెల్లంచాల‌ని ప‌దే ప‌దే అడ‌గ‌డంతో బండ్ల గ‌ణేశ్‌ త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్ త‌ర‌ఫున ఓ చెక్కును వెంక‌టేశ్వ‌ర రావుకు ఇచ్చారు.

బండ్ల గ‌ణేశ్ ఇచ్చిన రూ.95 ల‌క్ష‌ల చెక్ బౌన్స్ కావ‌డంతో వెంక‌టేశ్వ‌రరావు ఇటీవ‌ల ఒంగోలు కోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా ఒంగోలు కోర్టు బండ్ల గ‌ణేశ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష‌, రూ.95 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. దీనిపై బండ్ల గ‌ణేశ్ స్పందిస్తూ త‌న‌కు చ‌ట్టం, న్యాయంపై న‌మ్మ‌కం ఉంద‌ని, దీనిపై హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఈలోపే క‌థ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. చెక్ బౌన్స్ అయింద‌ని ఒంగోలు కోర్టును ఆశ్ర‌యించిన జెట్టి వెంక‌టేశ్వ‌ర రావు తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశారు. త‌న‌కు బండ్ల గ‌ణేశ్‌తో వివాదం స‌మ‌సిపోయింద‌ని, త‌మ మ‌ధ్య మంచి స్నేహపూర్వ‌క సంబంధాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. ఈగో, మధ్యవర్తుల వల్ల కేసుల వరకు వెళ్లామ‌ని, ఇప్పుడు త‌మ‌ అనుబంధం మునుపటిలాగే కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే జెట్టి వెంక‌టేశ్వ‌ర రావు కేసు వాప‌స్ తీసుకున్నారా? లేదా? బండ్ల గ‌ణేశ్ ఆయ‌న‌కు డ‌బ్బులు చెల్లించారా? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>