అరుణాచలంలో మహా కార్తీక దీపం.. పోటెత్తిన భక్తులు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం (Arunachalam)  కొండపై మహా కార్తీక దీపం అత్యంత వైభవంగా వెలిగింది. సముద్ర మట్టానికి 2,668 అడుగుల ఎత్తులో ఉన్న గిరి శిఖరంపై వేలాది మంది భక్తులు వీక్షిస్తుండగా.. అఖండ జ్యోతిని వెలిగించడంతో పవిత్ర పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మారుమోగిపోయింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.

శివుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తుండగా.. అక్కడున్న కొండ సాక్షాత్తూ పరమేశ్వరుడిగానే భావిస్తుంటారు. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు మేర ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకోవడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించే మహా కార్తీక దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదయం నుంచే పుణ్యక్షేత్రం రద్దీగా మారిపోయింది. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>