కలం, ధర్మపురి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని (Dharmapuri Temple) దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో నిర్వహించిన పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

