కలం, వెబ్ డెస్క్: కార్తీక పౌర్ణమి వేళ హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ (SR Nagar)లోని జగన్నాథ్ రెసిడెన్సీలో నివసిస్తున్న భానుమతి ఇంట్లో సాయంత్రం దీపాలు వెలిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీరకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో బంజారాహిల్స్‌లోని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మరణించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కుమార్తె కిన్నెర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు. మంటలు ఆమెను అంటుకుని.. ఏసీ, సోఫాకు కూడా వ్యాపించడంతో ఫర్నీచర్ కూడా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్పేయడంతో ఇతర ప్లాట్లకు అంటుకునే ప్రమాదం తప్పింది.

